Type Here to Get Search Results !

Sports Ad

మైల్వార్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టనీయకుండా అడ్డుపడుతున్న సర్పంచ్ భర్త ఖలీద్ in Mailwar Village

మైల్వార్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టనీయకుండా అడ్డుపడుతున్న సర్పంచ్ భర్త ఖలీద్ 

* సర్పంచ్ భర్త ఖలీద్ వారి అనుచరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
* చట్టపరమైన చర్య తీసుకోవాలి 
* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం 
* గ్రామ నడిబొడ్డున పెట్టాలని ప్రజా సంఘాల  డిమాండ్

బషీరాబాద్ Basheerabad : జీవించడానికి హక్కు కల్పించిన మహాత్ముడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన విగ్రహాని పెట్టడానికి ప్రజలు ఇష్టపడడంలేదు.ఈ దౌర్భాగ్యమైన ఘటన బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో చేటు చేసుకుంది.ఈ సందర్భంగా సిఐటియు  జిల్లా ఉపాధ్యక్షులు కే.శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కుల జిల్లా అధ్యక్షులు చంద్రయ్య మాట్లాడుతూ బషీరాబాద్ మండల కేంద్రంలో మైల్వార్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అందరు కూడా  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కోసం పునాది తీయడానికి పనులు చేస్తున్న ఎస్సీ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులపై సర్పంచ్ భర్త ఖలీద్ వారి అనుచరుల మాల మాదిగ లంజా కొడుకులరాని బూతులు తిడుతూ కులం పేరుతో దూషించిన వారిపై  చట్టపరంగా చర్యలు  తీసుకోవాలని డిమాండ్ చేశారు.నేటికీ గ్రామాలలో కుల వివక్షత  అంటారనితనం కొనసాగడం సిగ్గుచేటు.

అదేవిధంగా  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను పెట్టకుండా అడ్డుపడుతూ అవమాన పరుస్తూ గ్రామ సర్పంచి భర్త ఖలీద్ పంచాయతీ సెక్రటరీ నర్సింలు గౌడ్ వారి అనుచరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు మహనీయుల విగ్రహాలు ఇప్పించడం అభినందనీయమే కానీ  గ్రామాలలో నడిబొడ్డున ఏర్పాటు చేసే విధంగా లేదా మెయిన్ చౌరస్తాలలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా మండల అధికారులకు పంచాయతీ అధికారులకు ఆదేశించాలని కోరడమైనది.అంబేద్కర్ విగ్రహాల నిర్మాణ విషయంలో అనేక గ్రామలలో గొడవలు జరుగుతున్నాయి.కాబట్టి వీటి పైన దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. 

సర్పంచులకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలి  

మైల్వార్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గత నాలుగు సంవత్సరాల నుండి బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహము ఫోటో పెట్టి జయంతి వర్ధంతిలు నిర్వహించడం జరుగుతుంది.ఇప్పుడు కావాలని దురుద్దేశంతో సర్పంచ్ భర్త ఖలీదు వారు అనుచరులు ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా అడ్డుపెడుతూ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత  డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టనీయకుండా అవమాన పరుస్తున్న వారందరిపై చర్య తీసుకోవాలని ఎమ్మార్వో గారికి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.

అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే సిఐటియు కేవీపీఎస్ ఎమ్మార్పీఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల  ప్రజాసంఘాలు  అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్డిఓ డిఎస్పి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ మండల ఇన్చార్జి కృష్ణ ,ఎస్టి మైనార్టీ హక్కుల జిల్లా అధ్యక్షులు చంద్రయ్య,కెవిపిఎస్ మండల అధ్యక్షులు సురేష్,అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అంబదాస్,మోహన్,వెంకట్,దేవప్ప,శ్రీకాంత్,వెంకటేష్,కాశప్ప తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం....  

- కుల వివక్షత చూపుతున్న పొడేం వీరయ్య ఇక్కడ క్లిక్ చేయండి 

- ఏప్రిల్ 8న హైదరాబాద్కు మోడీ ఇక్కడ క్లిక్ చేయండి 

- మైల్వార్  గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టనీయకుండా అడ్డుపడుతున్న సర్పంచ్ భర్త ఖలీద్ ఇక్కడ క్లిక్ చేయండి 

- ఇస్రో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
- తెలంగాణ విద్యుత్‌శాఖలో 100 ఉద్యోగాలు ఇక్కడ క్లిక్ చేయండి 
- హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్‌ కార్డులు ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. కులం అనేది మధ్యలో వచ్చింది కావున మధ్యలో నే పోతుంది ఎవ్వరు మనసుకు తీసుకో వద్దు . ఒక మనిషి బ్రతుకేలంటే అన్ని కులా వాళ్లు పని చేయడం వలనే ఒక మనిషి జీవనం కొనసాగుతుంది . కావున గొడవ వలన ఏమి రాదు క్షమిచడం మానవ దర్మం

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Hollywood Movies