Type Here to Get Search Results !

తెలంగాణ టెట్‌ పరీక్షకు ఎన్నికల గండం షెడ్యూల్‌ మార్పుకు ఛాన్స్‌ఉందా? Is there any chance of change in election schedule for telangana tet exam?

 తెలంగాణ టెట్‌ పరీక్షకు ఎన్నికల గండం షెడ్యూల్‌ మార్పుకు ఛాన్స్‌ఉందా?

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో టీచర్‌ ఎలిజి బిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలు కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామ ని విద్యాశాఖ పేర్కొంది. ఇక జూన్‌ 12న టెట్‌ 2024 ఫలితాలు కూడా ప్రకటి స్తామని షెడ్యూల్‌లో పేర్కొం ది. దీంతో నిరుద్యోగులు టెట్‌ ప్రిపరేషన్‌లో మునిగి పోయారు.అయితే సార్వత్రిక ఎన్నికల గండం గడిచినా. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం టెట్ పరీక్షపై పడుతుందేమోనని పలువురు నిరుద్యోగులు  ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

     ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ గురువారం (ఏప్రిల్‌ 25) విడుదలైంది. మే 27న ఉప ఎన్నిక పోలిం గ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌ పేర్కొంది. ఈ క్రమంలో మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించడంతో అసలు ఆయా తేదీల్లో పరీక్షలు ఇంటాయో.. లేదోనని అభ్యర్ధులు గందరగోళంలో పడ్డారు. మే 27న పోలింగ్‌ కాబట్టి ఆ రోజు ఆయా జిల్లాల్లో సాధా రణ సెలవుగా ప్రకటిస్తారు. టెట్‌ పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు కావడంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే టెట్‌ పరీక్ష ల నిర్వహణ సాధ్యా సాధ్యా లపై పాఠశాల విద్యాశాఖ తర్జనభర్జనలు పడుతుంది. తెలంగాణ టెట్‌ పరీక్షలు మే 20 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహిస్తామని చెప్పిన ప్పటికీ ఏ తేదీన ఏ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తామనే విష యం మాత్రం ఇప్పటివరకు విద్యాశాఖ వెల్లడించలేదు. అయితే ఉప ఎన్నికల నేపథ్యంలో పేపర్ల వారీగా పరీక్షల నిర్వహణ తేదీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆ ప్రకారంగా పోలింగ్‌ రోజున పరీక్షలు జరపకుండా మిగతా రోజు ల్లో యథావిథిగా జరిగేలా షెడ్యూల్‌ రూపొం  దించే అవకాశం ఉన్నట్లు సమా చారం. ఇందుకు సంబం ధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం... 
 * కాంగ్రెస్ పార్టీలోకి ఎడవల్లి కృష్ణ ఇక్కడ క్లిక్ చేయండి 
 * నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ ఇక్కడ క్లిక్ చేయండి
 * నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్-2025 విడుదల.. ఇక్కడ క్లిక్ చేయండి
 * భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం ఇక్కడ క్లిక్ చేయండి
 * వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఇక్కడ క్లిక్ చేయండి
 * 13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణ టెట్‌ పరీక్షకు ఎన్నికల గండం షెడ్యూల్‌ మార్పుకు ఛాన్స్‌ఉందా? ఇక్కడ క్లిక్ చేయండి
 * ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : తహశీల్దార్ వై వెంకటేష్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies