Type Here to Get Search Results !

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ప్రకటన Alert for Telangana Inter students, announcement of supplementary exam dates

 తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ప్రకటన

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు మే/జూన్ 2024 లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు, ప్రాక్టికల్స్ తేదీలను ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.ప్రాక్టికల్స్ తేదీలు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జూన్ 03 నుంచి 07వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం మధ్యాహ్నం సెషన్ 2:00 P.M. నుంచి 5:00 PM వరకు ఉంటుంది. ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష (1వ సంవత్సరం విద్యార్థులకు) జూన్ 10, 2024(సోమవారం) ఉదయం 9:00 నుండి నిర్వహించనున్నారు.ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 11, 2024న ఉదయం 10:00 AM నుంచి 1:00 PM వరకు నిర్వహించనున్నారు. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష(2వ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే) జూన్ 12వ తేదీ ఉదంయ 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 నిర్వహిస్తారు.తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు

(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు)

24-05-2024(శుక్రవారం) : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

25-05-2024(శనివారం) : Part I -ఇంగ్లిష్ పేపర్-1

27-05-2024(సోమవారం) : Part -III -గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1

28-05-2024(మంగళవారం) : గణితం పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

29-05-2024(బుధవారం) : పిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1

30-05-2024(గురువారం) : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1

31-05-2024(శుక్రవారం) : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1(For BiPC Students)

01-06-2024(శనివారం) : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

తెలంగాణ ఇంటర్ సెకండియ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు   (మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు)

 24-05-2024(శుక్రవారం) : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2

25-05-2024(శనివారం) : Part I -ఇంగ్లిష్ పేపర్-2

27-05-2024(సోమవారం) : Part -III -గణితం పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2

28-05-2024(మంగళవారం) : గణితం పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2

29-05-2024(బుధవారం) : పిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2

30-05-2024(గురువారం) : కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2 31-05-2024(శుక్రవారం) : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(For BiPC Students01-06-2024(శనివారం) : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 ఇంటర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తల కోసం... 
* కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న ఇక్కడ క్లిక్ చేయండి 
* ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ఇక్కడ క్లిక్ చేయండి
* మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నేటితో నామినేషన్ గడువు ముగింపు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies